Jamili: లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..! 5 d ago
ఢిల్లీ: లోక్‌సభలో మంగళవారం జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశ పెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో 2 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. లోక్‌సభ ముందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాల్సి వుంది. ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండి కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. లోక్‌సభలో బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం విప్ జారీ చేసింది. మూడు లైన్ల విప్‌ను బీజేపీ జారీ చేసింది.